బాల‌సాయి బాబా క‌న్నుమూత‌

Balasai Baba passes away

బాల‌సాయి బాబా క‌న్నుమూత‌

వివాదాస్ప‌ద బాబా బాల‌సాయి మృతి చెందారు. హైద‌రాబాద్ విరించి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేప‌టి క్రితం మృతి చెందారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన బాబా శివ‌రాత్రి రోజు నోటి నుంచి శివ‌లింగాలు తీస్తూ కాంట్ర‌వ‌ర్సియ‌ల్ వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నారు. అర్థ‌రాత్రి లోయ‌ర్ ట్యాంక్ బండ్ వ‌ద్ద ఆశ్ర‌మంలో ఉన్న బాల‌సాయి బాబాకు గుండెపోటు రావ‌డంతో అనుచ‌రులు హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

అయితే, శివ‌రాత్రి రోజున నోట్లో నుంచి శివ‌లింగాల‌ను బ‌య‌ట‌కు తీస్తూ విదేశీల‌యుల‌ను బాల‌సాయి ఆక‌ట్టుకునేవారు. శివ‌లింగాన్ని బ‌య‌ట‌కు తీస్తూ నానా ఇబ్బందులు ప‌డేవారు బాల‌సాయి. అచ్చం పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయిబాబా  పోలిక‌ల‌తో ఉన్న ఈ వివాదాస్ప‌ద బాబా భ‌క్తుల‌ను సంపాదించుకున్నారు.  బాబా చేస్తున్న మాయ‌లను అనేక మంది హేతువాదులు తూర్పార‌బ‌ట్టారు. అనేక కేసులు బాల‌సాయిబాబాపై ఉన్నాయి. 
 

Comments