డైరీ మిల్క్ చాక్లెట్ తిని చనిపోయిన పసి పాప Dairy Milk Chocolate Eating and Dying Babies

 Dairy Milk Chocolate Eating and Dying Babies

         డైరీ మిల్క్ చాక్లెట్ తిని చనిపోయిన పసి పాప 
 

       ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో జరిగింది. శ్రీమంగలే హన్మంతు, స్థానికంగా అక్కడే ఉంటున్నాడు...అతనికి ఈ మధ్యే కూతురు పుట్టింది....పేరు సమీక్ష అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు...పాప కి చాక్లెట్ లని చాలా ఇష్టపడి తినేది...ఒకరోజు డైరీ మిల్క్ చాక్లెట్ కొనిచ్చాడు....అది తిన్న సమీక్ష మూడు నాలుగు గంటలవరకు బాగానే ఉంది ఆ తరువాత  ఉన్నట్టుండి ఒక్కాసారిగా  ఏడుపు మొదలు పెట్టింది...ఎంత బుజ్జగించినా ఏడుపు ఆపలేదు..స్పృహ కోల్పోయింది...2 సంవత్సరాల వయసు ఉన్న సమీక్షను తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు...ఎందోస్కోపి స్కానింగ్ తీసారు  డాక్టర్లు, కడుపులో పెద్ద నులి పురుగు ఉందని తేల్చేసారు...ఆపరేషన్ చేసి తీయాలన్నారు...వెంటనే సిద్డం చేసారు...ఆపరేషన్ చేసి ఒక పెద్ద నులి పురుగును బయటికి తీసారు.... కానీ ఆ పసి పాప ప్రాణం దక్కలేదు....ఆపురుగును ఆ పసి ప్రాణం తట్టుకోలేకపోయింది....కన్న కూతురిని పోగొట్టుకుని తల్లిదండ్రులు నరకయాతన అనుభవించారు....ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చూసి అందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు...

      నిజంగా డైరీ మిల్క్ తినడం వల్లే చనిపోయిందా ? లేక అందులో పురుగులు రావడం వల్లే జరిగిందా? అనే అనుమానాలు అందరిలో వ్యక్తం కావచ్చు...నిజానికి ఇక్కడ రెండు ప్రమాదమైనవే....అది కంపనీ తప్పు కాదని కొందరంటే, అది కేవలం కంపనీ చేసిన నిర్లక్ష్యం వల్లే ఈ తప్పు జరిగింది అనేది కొందరి అభిప్రాయం...నిజానికి చాక్లెట్ అంటే అందరూ ఇష్టపడతారు. కానీ చాక్లెట్ అంటే పిచ్చెక్కిపోయేవాళ్లు  ప్రపంచ ఉత్పత్తిలో సగం చాక్లెట్ ని.. పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా ప్రజలు తినేస్తున్నారు...స్విట్జర్లాండ్ ప్రజలకు చాక్లెట్ వాసన, దాని తీయదనం అంటే చాలా ఇష్టం. 2017లో ఇక్కడ సగటున ఒక వ్యక్తి 8 కిలోల చాక్లెట్లు తిన్నట్టు గుర్తించారు.అయితే  ఏ రకం చాక్లెట్‌లోనైనా కెఫిన్‌, చక్కెర్లు ఎక్కువగానే ఉంటాయి. కెఫిన్‌ చాక్లెట్‌ తినడాన్ని ఓ వ్యసనంలా మారుస్తుంది. ఒకసారి అలవాటై తినకపోతే చికాకు తెప్పిస్తుంది. మరోవైపు.. ఇందులోని చక్కెర్లు ఫ్యాట్‌ విపరీతంగా పెంచేస్తాయి. కొన్ని చాక్లెట్‌లలో ‘కేవలం కొబ్బరి చక్కెరే వాడాం, బ్రౌన్‌ షుగరే వేశాం..!’ అని ప్రచారాలు చేస్తుంటారు. చక్కెర ఏ రూపంలో ఉన్నా ఒక్కటేననే విషయం మరిచిపోకూడదంటున్నారు నిపుణులు! అవి తెచ్చే దుష్ఫలితాల్లో పెద్ద తేడా ఉండదనీ చెబుతున్నారు. కాబట్టి చాక్లెట్ లకు బానిసలు కాకండి...ఆరోగ్యాన్ని పాడుక్ పాడు చేసుకోకండి... ఉరుకులు పరుగుల జీవితంలో పెద్దలు ఎంత తీరిక లేకున్నా ఓపిక చేసుకుని చిన్నారులకు ఇంటి వంట అందించడం మంచిది. ప్యాకెట్‌ ఫుడ్డు జోలికి వెళ్లకుండా ఉండడం మరీ మంచిది.

Comments