పాన్ కార్డ్ లో కొత్త రూల్స్.....బిజినెస్ మ్యాన్ లను టార్గెట్ చేసిన ఇన్కంటాక్స్

New Rules on PAN Card ...... Income Taxes Targeted by Business Managers

          పాన్ కార్డ్ లో కొత్త రూల్స్.....బిజినెస్ మ్యాన్ లను  టార్గెట్ చేసిన ఇన్కంటాక్స్ 
 

              పాన్ కార్డ్... ప్రతీ ఒక్కరికీ ఇది ఓ అవసరం. బ్యాంక్ అకౌంట్ నుంచి ఇన్‌‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వరకు... అన్నింటికీ పాన్ కార్డ్ తప్పనిసరి. కొన్నిసార్లయితే పాన్ కార్డు లేనిదే పని జరగదు. బ్యాంక్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, డీమ్యాట్ అకౌంట్. రూ.50 వేల కన్నా ఎక్కువ డిపాజిట్. ఫారిన్ ట్రిప్ కోసం టికెట్ బుకింగ్. ప్రాపర్టీ కొనడం, అమ్మడం. వాహనం అమ్మడం, కొనడం. హోటల్, రెస్టారెంట్‌లో రూ.50 వేల కన్నా ఎక్కువ క్యాష్ పేమెంట్. షేర్లు, బాండ్లల్లో పెట్టుబడులు, రూ.50 వేల కన్నా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్. ఫారిన్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవడానికి. విదేశాల్లో చదువుతున్న పిల్లలకు డబ్బులు పంపేందుకు. రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగలు కొనడానికి. ఇలా ప్రతి దాంట్లో ఇపుడు పాన్ కార్డ్ వాల్యూ పెరిగింది...ఇంతకుముందు దీని అవసరం వేరే విధంగా ఉండేది...ఇపుడు దీని అవసరం పెరిగిపోయింది కాబట్టి దానికి అనుగుణంగానే ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ వారు కూడా అనేక మార్పులు, కొత్త రూల్స్ ని పెడుతూ వచ్చారు....

       తాజాగా ఆదాయపు పన్ను శాఖ మరికొన్ని రూల్స్ ని తీసుకొచ్చింది.... ముఖ్యంగా  మీ ఆన్యువల్ ఇన్కం రూ.2.5 లక్షలు దాటినా వారికీ కొత్త రూల్ ని తీసుకొచ్చారు.  పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోడానికి ఇప్పటి వరకు ఉన్న క్రైటీరియాలో మార్పులు  చేస్తూ కొత్తగా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిబంధన కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తించనుంది. పెద్దగా టర్నోవర్‌లేని చిరువ్యాపారులకు ఇప్పటివరకు పాన్ కార్డ్ తప్పకుండా ఉండాలనే నిబంధన లేదు. ఇప్పటివరకుఆన్యువల్ ఇన్కం లో  రూ.5 లక్షలు టర్నోవర్ దాటే వ్యాపార సంస్థలకు మాత్రమే పాన్‌కార్డ్‌ను తప్పనిసరి అని నిబంధన ఉంది. తాజా సవరణ ప్రకారం.. ఈ పరిధిని రూ.2.5 లక్షలకు తగ్గించారు. అంటే, ఏటా రూ.2.5 లక్షలు టర్నోవర్ దాటే ప్రతి వ్యాపారికి ఇక పాన్‌కార్డ్ తప్పనిసరి. ఈ కొత్త నిబంధన డిసెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. అయితే, కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుంది. 

         ఈ నిబంధన కిందికి వచ్చే వ్యాపారులంతా వచ్చే ఏడాది మే 31 కల్లా పాన్ కార్డులను పొందాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం బోగస్ కంపెనీల తేట తీయడానికి కూడా ఐటీ సిద్ధమవుతోంది. తాజా నిబంధనల ప్రకారం ఇకపై పాన్ కార్డులో తండ్రి పేరు కూడా తప్పనిసరి కాదు. ఒకవేళ తండ్రి లేని వ్యక్తులు తల్లి పేరు చెప్పినా ఆక్సెప్ట్ చేస్తారు....బిజినెస్ చేసే వారంతా ఈ రూల్ ని పాటించాల్సిందే మరి...మీరు బిజినెస్ మ్యాన్ అయితే ఈ రూల్ గురించి మరింత డీటెయిల్ గా తెలుసుకోండి...

Comments