రూ.210 కడితే నెలకి రూ.5000 వస్తాయి....మోడీ ప్రభుత్వం కొత్త పధకం

Rs.210 per month would be Rs.210 / month .... The Modi government is a new project

         రూ.210 కడితే నెలకి రూ.5000 వస్తాయి....మోడీ ప్రభుత్వం కొత్త పధకం
 

       ప్రస్తుతం కాలంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.  మనిషికి ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము ఇప్పుడు బాగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఎలా ఉంటాడో చెప్పలేము అటువంటి పరిస్థితిలో మన జీవితానికి భరోసా కావాలి మన కుటుంబానికి ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఇక ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోతే కుంటుంబానికి ఏమైతుందో అని ఆలోచించడం మనిషికి చాలా కష్టం. మరి జీవితంలో భరోసా కావాలి అంటే ఏమి చేయాలి జీవిత భీమా చేయించుకోవాలి.

        కేంద్ర ప్రభుత్వం ఎన్నో సరికొత్త పధకాలు ప్రవేశ పెడుతోంది..ప్రజలకు అండగా ఉండేందుకు రకరకాల స్కీమ్స్, ను అమలు చేస్తోంది భారత ప్రభుత్వం...ఇక తాజగా మరో సరికొత్త పధకం తో ముందుకు వచ్చింది ఎన్డీయే ప్రభుత్వం. నిజానికి చాలా కంపెనీలు భీమా సౌకర్యం కలిపిస్తున్నా కూడా వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. నెలకు కనీసం రూ.1000 నుంచి భీమా మొదలవుతుంది. ఇక ఇక్కడ పాయింట్ ఏంటి అంటే డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్న వారు భీమాలు కట్టుకుంటారు మరి పేదలు మరియు మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే చాలా బాధ వేస్తుంది.దీని గురించి ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం పేదలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకి భరోసా తీసుకొచ్చింది అదే ప్రధాన మంత్రి అటల్ పెన్షన్ యోజన ఇక ఇందులో ఏమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం.

           ఒకవేళ మీకు 18 సంవత్సరాలు వయస్సు ఉంటే నెలకు రూ.42 కడితే సరిపోతుంది. ఇలా మీరు ఈ రూ.42 రూపాయిలను 42 సంవత్సరాలు పాటు కట్టాలి ఇలా కడితే మీకు 60 సంవత్సరాలు వచ్చే సరికి మీకు 60 ఏళ్ళు వచ్చాక నెలకు రూ.1000 పెన్షన్ వస్తుంది. మీకు నెలకి రూ.2000 పెన్షన్ రావాలి అంటే మీరు రూ.84 చెల్లించాలి అదే మీకు నెలకి రూ.5000 పెన్షన్ కావాలి అంటే రూ.210 రూపాయలు 42 సంవత్సరాల వరకు చెల్లించాలి. ఇలా చెల్లిస్తే మీకు 60 సంవత్సరాల తర్వాత నెలకి రూ.5000 పెన్షన్ రూపంలో తీసుకోవచ్చు. అది చనిపోయేంత వరకు ప్రభుత్వం క్రమం తప్పకుండ ఇస్తుంది.అదే ఇప్పుడు మీకు 42 సంవత్సరాలు ఉంటే మీకు నెలకి రూ.5000 పెన్షన్ రావాలి అని అనుకుంటే మీరు నెలకి రూ.1400 రూపాయలు 20 సంవత్సరాల వరకు కట్టాలి. మీకు ఎన్ని సంవత్సరాల వయస్సు ఉందొ దాని పట్టి మీరు కట్టుకోవచ్చు.

         ఇక ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ అటల్ పెన్షన్ యోజన డబ్బులు కడుతూ ఉండగా, మీకు ఏమన్నా జరిగితే మీరు భీమా చెల్లించాల్సిన అవసరం లేదు.ఇక మీరు రూ.1000 ప్లాన్ కడుతూ మీకు ఏమన్నా జరిగితే మీ కుటుంబానికి రూ.1 .70 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే మీరు రూ.5000 ప్లాన్ కడుతూ మీకు ఏమన్నా జరిగితే మీ కుటుంబానికి రూ.8 .50 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది.ఇక ఈ పధకాన్ని ఎలా వినియోగించుకోవాలి అని మీకు సందేహం ఉండచ్చు చాలా సులభం అంది మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకుకు వెళ్లి ఈ పధకాన్ని అకౌంట్ ఓపెన్ చేయవచ్చు, దీనికి సంబంధించిన అప్లికేషన్ నింపడం కూడా చాలా సులభం సో.... మీరు తప్పకుండ ఈ పధకాన్ని వినియోగించుకొని మీ కుటుంబానికి రక్షగా ఉండండి.
 

Comments