భ‌ర్త‌కు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని.. భార్య‌తో డీఎస్పీ రాస‌లీల‌లు

The husband is employed by the DSP with the wife


మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న ఓ డీఎస్పీ అడ్డంగా బుక్క‌య్యాడు. వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న మ‌హిళ భ‌ర్త తోపాటు భ‌ర్త‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు ఆ పోలీసు ఉన్న‌తాధికారి చిత్తూరు జిల్లా తిరుచానూరులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. త‌న భార్య‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని ఆగ్ర‌హించిన భ‌ర్త డీఎస్పీ ప‌గ‌డాల నాగ‌దుర్గ ప్ర‌సాద్ ను ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే, మీడియాను చూసి డీఎస్పీ అక్క‌డ్నుంచి ప‌రార‌య్యాడు. స‌ద‌రు మ‌హిళ‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ కోసం పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించాడు. 

ప‌గ‌డాల నాగ దుర్గ ప్ర‌సాద్ మంగ‌ళ‌గిరి 9వ బెటాలియ‌న్‌లో డీఎస్పీగా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. హైద‌రాబాద్ నిజాంపేట్‌లో ఉన్న స‌మ‌యంలో ప్ర‌సాద్‌రెడ్డి, ధ‌న‌ల‌క్ష్మీ దంప‌తుల‌తో డీఎస్పీకి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ప్ర‌సాద్‌రెడ్డి స్వ‌స్థ‌లం చిత్తూరు జిల్లా క‌లికిరి, అయితే, ప్ర‌సాద్‌కు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని న‌మ్మించిన డీఎస్పీ తెర వెనుక ఆయ‌న భార్య‌కు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని న‌మ్మించాడు. టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఉంద‌ని, తిరుప‌తికి వెళ్ల‌మ‌ని ప్ర‌సాద్‌రెడ్డి దంప‌తుల‌కు సూచించారు.  ఈ క్ర‌మంలోనూ ప్ర‌సాద్‌రెడ్డి, ధ‌న ల‌క్ష్మీ తిరుచానూరులోని వైష్ణ‌వి అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగారు. డీస్పీతో చ‌నువుగా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిన ప్ర‌సాద్‌రెడ్డి ప‌లుమార్లు భార్య‌ను హెచ్చ‌రించాడు. 

అయినా, ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పురాక‌పోగా  భ‌ర్త‌ను దూరం పెట్టింది. త‌నను వేధిస్తున్నాడ‌ని పోలీసుల‌కు సైతం ఫిర్యాదు చేసింది. భార్య తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్ర‌సాద్‌రెడ్డి కొంత కాలంగా స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆదివారం వైష్ణ‌వి అపార్ట్‌మెంట్స్‌లో త‌న భార్య‌తో డీఎస్పీ ఉండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు. మీడియాను చూసి భ‌య‌ప‌డిన డీఎస్పీ నాగ ప్ర‌సాద్ అక్క‌డ్నుంచి ప‌రార‌య్యాడు. ఈ వ్య‌వహారంపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

Comments