మ‌హిళ‌ల‌పై నీచ రాత‌లు రాస్తున్న వ్య‌క్తి అరెస్ట్

Arrested by women who are scared of women

మ‌హిళ‌ల‌పై నీచ రాత‌లు రాస్తున్న వ్య‌క్తి అరెస్ట్

ఇంట‌ర్‌నెట్‌లో మ‌హిళ‌లు, యువ‌తులపై  అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో కామెంట్లు పెడుతున్న కేటుగాడు వ‌ర్ర ర‌వీంద్ర‌రెడ్డిని హైద‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.  రాజ‌కీయ నేత‌ల కుటుంబాల‌పై నీచమైన బూతులు రాస్తూ ఫేస్‌బుక్ లో పోస్టులు పెడుతున్న‌ట్టు విచార‌ణ‌లో తేలింది. 

ఫేస్‌బుక్‌లో అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్లు చేస్తున్న ర‌వీంద్ర‌రెడ్డిది క‌డ‌ప జిల్లా కొండారెడ్డిప‌ల్లి మండ‌లం  వేముల‌ప‌ల్లి. 2013లో క‌డ‌ప పోలీసు స్టేష‌న్‌లో ర‌వీంద్ర‌రెడ్డిపై రౌడీషీట్ న‌మోదైంది. అయితే, మ‌హిళ‌ల‌పై ఇంట‌ర్‌నెట్‌లో బూతు భాష వాడే వారికి  జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు.  


 

Comments