త‌మిళ హీరో విజ‌య్‌తో ర‌ష్మిక జోడీ..!

Tamil movie hero Vijay

త‌మిళ హీరో విజ‌య్‌తో ర‌ష్మిక జోడీ..!

త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం ముద్దుగుమ్మ‌లు ఏ ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చినా ఒక‌సారి తెలుగులోకి అడుగుపెట్టి ఒక్క హిట్ కొడితే చాలు పంట పండిన‌ట్లే. వ‌రుస ఆఫ‌ర్స్‌తో తెలుగు ఇండ‌స్ట్రీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ప‌క్క‌నే ఉన్న త‌మిళ తంబీలు పిలిచి మ‌రీ ఆఫ‌ర్స్ ఇచ్చారు. 


చ‌లోతో అడుగు పెట్టిన ర‌ష్మిక ఆ త‌రువాత గీతా గోవిందం దేవ‌దాసులో న‌టించింది. ప్ర‌స్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో మ‌రో సారి విజ‌యదేవ‌ర‌కొండ‌తో చ‌లోతో త‌న‌ను ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు వెంకి కుడుముల తీసే భీష్మ మూవీలో నితిన్ స‌ర‌స‌న సెలెక్ట్ అయింది. 


రెండు బంప‌ర్‌హిట్స్ ఉన్నా.. చేతిలో ఛాన్స్‌లు ఉన్నా.. స్టార్ హీరోల క‌న్ను మాత్రం ఈ అమ్మ‌డుపై ప‌డ‌లేదు. క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక‌ను తెలుగు స్టార్స్ ప‌ట్టించుకోక‌పోయినా త‌మిళ‌స్టార్ విజ‌య్ ర‌ష్మిక‌తో ఆడిపాడ‌నున్నార‌ట‌. గ‌తంలో మెర్స‌ల్, తేరి వంటి రెండు సినిమాల‌తో రెండు హిట్స్ ఇచ్చిన అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టించ‌నున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ర‌ష్మికను తీసుకోనున్నార‌ని టాక్‌.

Comments