జబర్దస్త్ లో ఆది కనబకపోవడానికి కారణం చెప్పిన ఆది తల్లి

The mother was the reason for the birth of the goddess in Jabbarthat

         జబర్దస్త్ లో ఆది కనబకపోవడానికి కారణం చెప్పిన ఆది తల్లి
 

          తక్కువ టైంలో జబర్దస్త్ నే శాసించే స్థాయికి వెళ్ళిన హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే చాలు టీవీల ముందు అతుక్కుపోతారు. చిన్నా, పెద్దా, ఆడ, మగ తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఆది వేసే పంచుల కోసం ఎదురుచూస్తుంటారు. షో అయిపోయాక కూడా పదే పదే ఆది స్కిట్ లను యూ ట్యూబ్ లో చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు. అంతటితో ఆగకుండా ఆ నవ్వులను సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కి షేర్లు చేస్తుంటారు. కేవలం ఆది వేసే పంచుల కోసమే షో చూస్తారంటే ఆది రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

         సమాజంలో జరుగుతున్న తప్పులను ఖండిస్తూ సెటైర్లు వేసి నవ్వించడమే ఆది స్టైల్. అలాంటి ఆది కొన్ని ఎపిసోడ్స్ నుంచి కనబడడం లేదు. దీంతో ఆది జబర్దస్త్ ను వదిలేశారని వార్తలు వచ్చాయి. దీనికి తోడు, "హైపర్ ఆది - రైజింగ్ రాజు" అని ఉండాల్సిన టీం పేరు ఇప్పుడు రైజింగ్ రాజుగా వస్తుంది. దీంతో ఇక ఆది జబర్దస్త్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారన్న వార్తలు మరింత ఎక్కువయ్యాయి. అది చూసి తట్టుకోలేని ఆది అభిమానులు, "మా ఆది ఎక్కడా" అంటూ సోషల్ మీడియాలో జబర్దస్త్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు మాత్రం ఏమి తెలియనట్లుగా సైలెంట్ గా ఉంటున్నారు. దాంతో ఆది రెమ్యునరేషన్ ఎక్కువ అడిగారని, అందుకు వాళ్ళు నో అనడంతో ఆది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారని వార్తలను ప్రచారం చేస్తున్నారు. మరికొందరు మాత్రం "జనసేన మీటింగ్స్ చూస్తే అర్ధం కావడం లేదా? ఆది జనసేనలో చేరిపోయారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నారు. అవసరం అయితే జనసేన తరువున mla గా కూడా పోటీ చేస్తారు" అంటూ పోస్టులు పెడుతున్నారు.

       కానీ ఆది జబర్దస్త్ లో కనిపించకపోవడానికి అసలు కారణం అది కాదట. అతడి అమ్మగారే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆదికి ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందని, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే కొన్ని రోజులు జబర్దస్త్ షోలో కనబడడని, కానీ సినిమా పూర్తి కాగానే మళ్ళీ యధావిధిగా షో చేస్తాడని చెప్పారు. అంతేకాదు, తనకి జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ ని ఎప్పటికీ మర్చిపోడని, ఆ షోను వదిలి వెళ్ళే సమస్యే లేదని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా మూవీలో ఆదికి ఒక మంచి పాత్ర దొరికిందని వార్తలు వినిపిస్తున్నాయి. 

Comments