విమానంలో లోప‌ల 244 మంది ప్ర‌యాణికుల ప్రాణాల‌తో చెల‌గాటం..!

244 passengers survived within the plane

పీకలదాకా తాగి విమానం న‌డిపిన పైలెట్.. 

ఒకవైపు వరుస విమాన ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపధ్యంలో తనకు ఇవేమీ పట్టనట్టు వ్యవహరించాడు ఓ పైలెట్. పీకలదాకా తాగొచ్చి విమానం నడపడానికి వచ్చాడు. పొరపాటున ఆ వ్యక్తి విమానం ఎక్కితే 244 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. లక్కీగా ఎయిర్ పోర్ట్ సిబ్బందులు కరెక్ట్ గా తమ పనిని నిర్వర్తించడం వల్ల 244 మంది ప్రయాణికులు జరగబోయే ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం లండన్ నుంచి టోక్యో వెళ్ళేందుకు రన్ వే మీద సిద్ధంగా ఉంది. ఐతే, విమానం బయలుదేరే ముందు పైలెట్ "కత్సుతోషి జిత్సుకవా" ప్రవర్తన తేడాగా ఉండడంతో అనుమానించిన అధికారులు అతనికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో అతని రక్తంలో ఉండవలసిన ఆల్కహాల్ స్థాయి కంటే మించి ఉందని తేలింది. రూల్స్ ప్రకారం 100 మిల్లీలీటర్ల రక్తంలో 80 మిల్లీ గ్రాముల ఆల్కహాల్ కి అనుమతి ఉంది.


 ఐతే ఆ పైలెట్ రక్తంలో ఏకంగా 189 మిల్లీ గ్రాముల ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణానికి ముందురోజు రాత్రి రెండు బాటిళ్ల వైన్‌, ఒక జగ్గు బీరు తాగినట్టు పైలెట్ ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. దాదాపు ఒక గంట తర్వాత మిగతా ఇద్దరు పైలెట్లతో విమానం బయలుదేరింది. అందులో 244 మంది ప్రయాణికులు ఉన్నారు. పొరపాటున అతను విమానం ఎక్కి ఉంటే ఎంత ఘోరం జరిగి ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇక పైలెట్ వ్యవహారంపై స్పందించిన జపాన్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. "ప్రయాణికుల భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని" హామీ ఇచ్చింది. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కోర్టు ఆ పైలెట్ లైసెన్స్ ను రద్దు చేస్తూ కఠిన శిక్ష విధించింది


.తాగి సొంత వాహనం నడిపితే నడిపిన వ్యక్తి తాలూకు కుటుంబం మాత్రమే రోడ్డున పడుతుంది. అదే తాగి సంస్థల వాహనాలు నడిపితే వందల కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి దయచేసి డ్యూటీలో ఉండగా మద్యం తాగకండి. వందల కుటుంబాలు అయినా, ఒక్క కుటుంబం అయినా రోడ్డున పడడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి సొంత వాహనాలు నడిపే వాళ్ళు కూడా మద్యం సేవించకుండా సురక్షితంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాం. ఇక డ్యూటీలో ఉండగా మద్యం తాగడమే కాకుండా, నిర్లక్ష్యంగా విమానం నడిపేందుకు వచ్చిన ఆ పైలెట్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. 


 

Comments