రాచ‌రికాన్ని వ‌దులుకున్న జ‌పాన్ యువ‌రాణి..!

Japanese princess who left the monarchy

 

జ‌పాన్ యువ‌రాణి అతి సామాన్యుడ్ని వివాహ‌మాడింది. అవును, విన‌డానికి కాస్త వింత‌గా అనిపించినా ప్రేమ‌కు ధ‌ని, పేద తేడా లేద‌ని నిరూపించింది. జ‌పాన్ రాజ‌రిక‌పు సంప్ర‌దాయం ప్ర‌కారం సామాన్యుల‌ను పెళ్లి చేసుకుంటే  రాజ‌రికాన్ని వ‌దులుకోవాల్సిందే. అయితే, దీనికి కూడా యువ‌రాణి సిద్ధ‌ప‌డింది. 

సామాన్యుడిని యువ‌రాణి ప్రేమించ‌డం అత‌డి కోసం రాణీవాసాన్ని సైతం త్యాగం చేయ‌డం గురించి క‌థ‌ల్లో చ‌దువుకున్నాం. కానీ, జ‌పాన్‌లో ఇది నిజంగా జ‌రిగింది. జ‌పాన్ రాజ‌వంశపు యువ‌రాణి అయాకో కీ మోరియోకో అనే సామాన్యుడికి మ‌న‌సిచ్చింది. ఆ దేశ నిబంధ‌న‌ల ప్ర‌కారం  రాజ‌వంశ‌పు స్ర్తీలు సామాన్యుడ్ని పెళ్లి చేసుకుంటే త‌మ రాచ‌రికాన్ని శాశ్వ‌తంగా కోల్పోవాల్సి ఉంటుంది. పెళ్లి త‌రువాత సామాన్యురాలిగా ప‌రిగ‌ణించ‌డంతోపాటు ఆమె వార‌సుల‌కు సింహాసనంపై హ‌క్కు ఉండ‌దు. అదంత తెలిసి కూడా అయాకో త‌న ప్రేమ‌ను వ‌దులుకోలేదు. ఓ షిప్పింగ్ కంపెనీ ఉద్యోగి కీ మోరియోను రాజ కుటుంబం ప‌విత్రంగా ప‌రిగ‌ణించే మొయిజీ ఆల‌యంలో పెళ్లి చేసుకుంది. 

ఇత‌రుల‌ను వివాహం చేసుకోవ‌డానికి కొన్ని త‌రాల క్రిత‌మే రాజ‌కుటుంబం అనుమ‌తించింది. ప్ర‌స్తుతం చ‌క్ర‌వ‌ర్తిగా ఉన్న అకిహిటో రాజ‌కుటుంబేత‌ర వ్య‌క్తిని వివాహం చేసుకున్న వారిలో మొద‌టివాడు. టెన్నీస్ కోర్టులో మిచికోతో ఏర్ప‌డిన ప‌రిచ‌యం వివాహ బంధానికి కార‌ణ‌మైంది. అయాకోను ఇక నుంచి అయాకో మోరియాగా మాత్ర‌మే పిలుస్తారు. 

Comments