అదే గ‌నుక జ‌రిగితే ఏ ఒక్క టీడీపీ నాయ‌కుడు రోడ్డుపై తిర‌గ‌లేడు..!

If that happens then no TDP leader can turn on the road ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఓ యువ‌కుడు క‌త్తితో దాడి చేసిన విష‌యం తెలిసిందే. విశాఖ విమానాశ్ర‌యంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది. అందులో భాగంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకుని మ‌రిన్ని వివ‌రాల‌ను రాబ‌డుతున్నారు. అయితే, జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడిపై వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్  మాట్లాడారు. 

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే ద‌మ్ము లేక, ధైర్యం లేక సీఎం స్థానంలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఇలాంటి నీచ‌పు ప‌నుల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు. గ‌త తొమ్మిదేళ్ల నుంచి వైఎస్ జ‌గ‌న్‌కు స‌రైన సెక్యురిటీ ఇవ్వ‌కుండా నానా ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేశార‌న్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఏపీలో ఫ్యాక్ష‌నిజం పేట్రేగి పోయింద‌న్నారు. వైఎస్ జ‌గ‌న్‌పై దాడి చేసిన వ్య‌క్తి క‌త్తికి విషం పూశాడ‌ని కొంత‌మంది చెబుతున్నార‌ని, త‌మ నాయ‌కుడికి ఏదైనా జ‌రిగితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ ఒక్క నాయ‌కుడు కూడా రోడ్ల‌పై తిరిగే ప‌రిస్థితి ఉండ‌ద‌ని హెచ్చ‌రించారు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్‌. 
 

Comments