జర్న‌లిస్టును 15 ముక్క‌లుగా చేసి.. ఆపై..!

The journalist has been made into 15 pieces and then ..!

జర్న‌లిస్టును 15 ముక్క‌లుగా చేసి.. ఆపై..!

అక్టోబ‌ర్ 2, 2018. ట‌ర్కీలోని సౌదీ అరేబియా రాయ‌బారి కార్యాల‌యం. ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వ్య‌క్తిగ‌త ప‌నిమీద లోప‌లికి వెళ్లాడు. లోప‌లికి ఎంట‌ర్ అయిన కాసేప‌టి నుంచి అడ్ర‌స్ లేకుండాపోయాడు.  బ‌తికి ఉన్నాడో.. లేదో.. ఉంటే ఎక్క‌డ ఉన్నాడో ఎవ్వ‌రికీ తెలియ‌దు. కానీ, అత‌డ్ని క్రూరంగా చంపి, 15 ముక్క‌లు చేసి కాకుల‌కు, గ‌ద్ద‌ల‌కు వేశార‌ని తెలిసి ప్ర‌పంచం నివ్వెర‌పోయింది. నియంతృత్వ శ‌క్తులు త‌మ‌కు వ్య‌తిరేకంగా గొంతెత్తిన వారిని ఎలా అంతం చేయ‌గ‌ల‌వో మ‌రోసారి రుజువైంది. 

సౌదీ అరేబియా, రాజ‌రికం క‌బంధ‌హ‌స్తాల్లో న‌లుగుతున్న దేశం. అగ్ర‌రాజ్యం అండ‌తో ప‌బ్బం గడుపుకుంటున్న అర‌బ్ దేశం. రాజ‌వంశానికి, రాజ‌రిక అరాచ‌కాల‌కు వ్య‌తిరేకంగా నోరెత్తితే అడ్డంగా తొక్కేయ‌డం, విచార‌ణ లేకుండా కార‌ణాలు చెప్ప‌కుండా ఏళ్ల‌కు ఏళ్లు జైళ్ల‌లో బంధించ‌డం ఇక్క‌డ సాధార‌ణంగా జ‌రిగే విష‌యం. 

జ‌మాల్ క‌షోగ్గి సౌదీ అరేబియాకు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌. వాషింగ్ట‌న్ పోస్ట్ ప‌త్రిక‌కు విలేక‌రిగా ఉన్న క‌షోగ్గి ఈ నెల 2న అదృశ్య మ‌య్యాడు. సౌదీ రాజు స‌ల్మాన్‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాస్తున్న ఆయ‌న్ని విచార‌ణ పేరుతో హ‌త‌మార్చార‌న్న ఆందోల‌న కొద్ది రోజులుగా వ్య‌క్త‌మ‌యింది. అయితే, క‌శోగ్గి హ‌త్య అంశం ముదిరి పాకాన ప‌డ‌టంతో సౌదీ ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ను అత్యంత కిరాత‌కంగా చంపింద‌ని తేల‌డంతో అమెరికాతోపాటు దాని మిత్ర ప‌క్షాలు కూడా  మొస‌లి కన్నీళ్లు కారుస్తున్నాయి. 
 

Comments