ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెప్ప‌గానే జ‌గ్గారెడ్డి కుమార్తె ఏం చెప్పిందో తెలుసా..?

When the name of Pawan Kalyan is mentioned, what did Jaggareddi's daughter say?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,.. సినిమాల‌కు, రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తీ ఒక్క‌రూ ఇష్ట‌ప‌డే, గౌర‌వించే వ్య‌క్తి. అందుకు ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న వ్య‌క్తిత్వ‌మేన‌ని చెబుతుంటారు ఆయ‌న అభిమానులు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి స‌హాయం కోరిన ప్ర‌తీ ఒక్క‌రికీ.. లేదు, కాదు అని చెప్ప‌కుండా త‌న స‌హాయం చేయ‌డంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌ట ఉంటారు. ఆ వ్య‌క్తిత్వమే ఆయ‌న‌కు అశేష సంఖ్య‌లో అభిమానుల‌ను సంపాదించి పెట్టింది. 

అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై.. ఆయ‌న సేవాగుణంపై స్పందించ‌ని సెల‌బ్రెటీలు అంటూ ఎవ‌రూ ఉండ‌రు. మీడియా కంట ప‌డిన ప్ర‌తీ సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై స్పందించాల్సిందే. ఈ క్ర‌మంలోనే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే పిచ్చి.. ఆయ‌న‌తో క‌లిసి ఒక్క సినిమాలోనైనా న‌టించాల‌ని సినీ న‌టులు, ఆయ‌న వ్య‌క్తిత్వం చాలా గొప్ప‌ద‌ని రాజ‌కీయ నేత‌లు ఇలా ప్ర‌తీ ఒక్క‌రూ ప‌వ‌న్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. 

అలా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన వారిలో తాజాగా కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి కుమార్తె  జ‌యారెడ్డి చేరిపోయారు. అయితే, జ‌యారెడ్డి తాజాగా ఓ సోష‌ల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరోల్లో త‌న‌కు ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ అంటే ఇష్ట‌మ‌ని చెప్పింది. రాజ‌కీయంగా ప‌వ‌న్ ఇచ్చే ప్ర‌సంగాల‌ను తాను ఫాలో అవుతుంటాన‌ని, ఆయ‌న ప్ర‌సంగాల‌ను ఎక్కువ‌గా యువ‌త‌ను ఇన్‌స్పైర్ చేసే విధంగా ఉంటాయ‌ని చెప్పారు జ‌యారెడ్డి. 

Comments