మ‌హాకూట‌మిపై కోదండ‌రామ్ ఫైర్‌..!

Kodandaramam fire on mahoutumari ..!

తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్ర‌స్తుతం ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న కేసీఆర్‌ను, టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే, మ‌హాకూట‌మిలోని పార్టీల నేత‌లంద‌రూ తాము ఆశిస్తున్న సీట్ల జాబితాను మ‌హాకూట‌మి ముందు ఉంచారు. అయితే, మ‌హాకూట‌మి ఏర్పాటు వ‌ర‌కు ముంద‌డుగు వేసిన ప్ర‌తిప‌క్ష పార్టీలు సీట్ల పంప‌కం విష‌యంలో మాత్రం వెన‌క‌డుగు వేస్తున్నాయి. తాము అనుకున్న సీట్లు కేటాయించేందుకు విముఖ‌త చూప‌డంతో ప‌లు పార్టీల నేత‌లు సైతం ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు కోదండ‌రామ్ కూడా చేరిపోయారు.

ఇక అస‌లు విష‌యానికొస్తే, ఇవాళ హైద‌రాబాద్‌లో మ‌హాకూట‌మి పార్టీల నేత‌ల స‌మావేశం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో పాల్గొన్న జ‌న‌స‌మితి పార్టీ నేత కోదండ‌రామ్ మ‌హాకూట‌మిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశార‌ట‌. ఇంత‌కీ కోదండ‌రామ్ ఏమ‌న్నారంటే..? మ‌హాకూట‌మి స‌మావేశం చాయ్ తాగి, స‌మోసా తినేందుకు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, సీట్ల స‌ర్దుబాటు అంశంపై చ‌ర్చ ముందుకు సాగ‌కుంటే మ‌హాకూట‌మి బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పార‌ని తెలుస్తుంది. అలాగే, కోదండ‌రామ్ ఇవాళ సాయంత్రం హైద‌రాబాద్‌లో త‌న పార్టీ ముఖ్యనేత‌ల‌తో స‌మావేశం స‌మావేశమై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌నున్నార‌ని స‌మాచారం.

Comments