నేడు తెలంగాణ‌లో అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

Amit Shah's visit to Telangana today

తెలంగాణ‌లో పార్టీల‌న్నీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మునిగి తేలుతున్నాయి. వ‌రుస స‌భ‌ల‌తో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ క‌రీంన‌గ‌ర్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసింది. అంబేద్క‌ర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా హాజ‌ర‌వుతున్నారు. అయితే, గ‌తంలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల స‌భ విజ‌య‌వంతం కావ‌డంతో క‌మ‌లంపార్టీ నేత‌లు ఉత్సాహం మీద ఉన్నారు. క‌రీంన‌గ‌ర్ స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు బీజేపీ నేత‌లు అన్ని విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. దాదాపు ల‌క్ష మందిని త‌ర‌లించేందుకు బీజేపీ నేత‌లు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాతోపాటు స‌మీప జిల్లాల నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను త‌ర‌లించే ప‌నులల్లో బిజీ.. బిజీగా ఉన్నారు ఆ పార్టీ రాష్ట్ర నేత‌లు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో అమిత్ షా ఈ స‌భ‌లో పాల్గొన‌నున్నారు.

Comments