మ‌హాకూట‌మిలో సీట్ల పంచాయితీ..!

Seat Panchayat in Maha Mutta

మ‌హాకూట‌మిలో అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయా..?  సీట్ల పంచాయితీతో మొద‌టికే మోసం వ‌చ్చిందా..?  కాంగ్రెస్ పెడుతున్న ష‌ర‌తులు మిగ‌తా పార్టీల‌కే  న‌చ్చ‌డం లేదా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు మ‌హాకూట‌మి పార్టీల నేత‌లు. 

మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు లొల్లి ముదిరి.. ముదురుపాకాన ప‌డింది. ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డినా పార్టీల మ‌ధ్య ఇంకా సీట్ల స‌ర్దుబాటు కుద‌ర‌లేదు. త‌మ‌కు 20 సీట్లు కావాల‌ని డిమాండ్ చేస్తుంది కోదండ‌రామ్ పార్టీ. త‌మ‌కు 30 సీట్లు కావాల‌ని అడుగుతుంది టీడీపీ. మ‌రో ప‌క్క సీపీఐ 11 సీట్లు ఇవ్వాలంటూ ప‌ట్టుబడుతుంది.  ఇవన్నీ క‌లిపితే 61 సీట్లు అవుతున్నాయి.  ఇదిలా ఉండ‌గా, కాంగ్రెస్ మాత్రం 90 స్థానాల్లో క‌చ్చితంగా పోటీ చేయాల‌ని ఆలోచిస్తుంది. 

ఇదిలా ఉండ‌గా, సీట్ల స‌ర్దుబాటుపై ఇంకా ఓ కొలిక్కి రాలేద‌ని కూట‌మి నేత‌లు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. కోదండ‌రామ్ తాజాగా కూట‌మి తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇవాళ్టీ వ‌ర‌కు కూట‌మికి డెడ్‌లైన్ విధించిన ఆయ‌న వెంటనే తేల్చ‌కుంటే. .త‌మ దారి తాము చూసుకుంటామ‌ని అల్టిమేటం జారీ చేశారు. 

మ‌రో ప‌క్క‌, పొత్తు, సీట్ల స‌ర్దుబాటు కొలిక్కిరాక‌ముందే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆశావ‌హులు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్ధుల ఎంపిక‌లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు కాంగ్రెస్ నేత‌లు. సీట్ల స‌ర్దుబాటుపై ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌లు పార్టీల నేత‌లు అయోమ‌యంలో ప‌డ్డారు. 

Comments