ఈసారి జగన్ కే నా సపోర్ట్ పవన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? Pawan Kalyan To Support Ys jagan In 2019 Election, What is Pawan Master Plan?

Pawan Kalyan To Support Ys jagan In 2019 Election,  What is Pawan Master Plan?

             ఈసారి జగన్ కే నా సపోర్ట్ పవన్ మాస్టర్ ప్లాన్ ఏంటి?

             ఏ రంగంలో అయినా శతృత్వం అనేది కామన్. పక్కనోడు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక వాళ్ళని శతృవుల్లా చూస్తారు. అప్పటివరకూ స్నేహితులుగా ఉన్న వాళ్ళే ఈగో దెబ్బతింటే శతృవుల్లా మారిపోతారు. దీనికి రాజకీయరంగం మినహాయింపు కాదు. ఇంకా ఇక్కడే అసలు శత్రువులు ఉంటారు. ఒకరి మీద ఒకరు మాటల దాడి చేసుకోవడం నుంచి ఫిజికల్ గా ఎటాక్ చేసేంత వరకూ, ఇంకా ఎక్కువ మాట్లాడితే చంపేంత వరకూ ఈ శత్రువులు నిద్రపోరు, ఎందుకంటే వాళ్ళు ఆల్ రెడీ ప్రత్యర్ధుల గుండెల్లో నిద్రపోతుంటారు కాబట్టి. రాజకీయం అన్నాక సంపాదించుకోవడం అనేది చాలా కామన్ పాయింట్. అది సేవ చేసి సంపాదించిన ప్రజాభిమానం కావొచ్చు, అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ము కావొచ్చు, లేక శత్రువుయినా కావొచ్చు. బయట సంపాదించలేనిది రాజకీయాల్లో సంపాదించవచ్చు. మంచి చేస్తే ఇక శత్రువులని కూడా బాగా పోగవుతారు. ఎంత మంచి రాజకీయనాయకుడైనా, తను చేసే మంచి పనికి అడ్డొచ్చిన వారిని శత్రువులుగానే భావిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదని అంటున్నారు.

           2014 లో చంద్రబాబుకి సపోర్ట్ చేశాడు, అంత మాత్రాన బాబుకి మిత్రుడు, ఇప్పుడేమో రివర్స్ అయ్యాడు, బాబుకి శతృవు అని అనుకుంటున్నారు. కానీ రాజకీయాల్లో, ప్రజలకి సేవ చేసే విధానంలో తనకి మిత్రులు, శత్రువులు ఉండరని అన్నారు. తప్పు చేస్తే మిత్రుడినైనా విమర్శిస్తానని అన్నారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు. "రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వాటిని తాను పట్టించుకోనని చెప్పారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను పాలకుల్ని నిర్వీర్యం చేశారని, తాను పార్టీ పెట్టిన సమయంలో ఎన్టీఆర్ మాదిరి ఉప్పెన లేదని, అన్నయ్య చిరంజీవిలా ప్రవాహం లేదని చెప్పారు. తాను ఎదురీదుతూ పార్టీని పెట్టినట్లుగా చెప్పారు. అంతేకాదు, తనకి జగన్ శతృవు కానే కాదని, ఆ మాటకు వస్తే తనకు శత్రువులు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుపరిపాలన కోసమే టీడీపీకి మద్దతు ఇచ్చాను, మోసాలు చేస్తే తాను ఒప్పుకోనని చెప్పారు. జగన్ తనకు శత్రువు కాదన్న పవన్ మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో గతంలో బాబుకి సపోర్ట్ చేసినట్టే ఈసారి కూడా జగన్ కి సపోర్ట్ చేస్తారేమో అన్న అనుమానం కలుగుతుంది. ఐతే, దీని వెనుక పవన్ మాస్టర్ ప్లాన్ ఉందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

            2014 లో జనసేన ఎలక్షన్స్ లో నిలబడితే ఓడిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే అప్పటికీ పార్టీ రాజకీయంగా బలంగా లేదు. అందుకే బాబుకి మద్ధతు ఇచ్చి గెలిపించారు పవన్. ఇప్పుడు కూడా పవన్ పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఎందుకో ఇది సరైన సమయం కాదని వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం. పైగా గతంలో రెండు, మూడు సార్లు ఆయన అన్న మాటల వెనక ఆంతర్యం తెలుసుకుంటే, పవన్ ఈసారి ఎన్నికల్లో నిలబడరేమో అన్న అనుమానం కలుగుతుందని అంటున్నారు. ఎందుకంటే, పవన్ గతంలో ఓసారి రోడ్ షో చేస్తూ "జగన్ కి సపోర్ట్ చేయమంటారా చెప్పండి, చేస్తాను" అంటూ ప్రజలతో అన్నారు. అదీ కాక ఇప్పుడేమో జగన్ తన శతృవు కాదని అంటున్నారు. దీంతో పవన్ ఈసారి కూడా ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా, జగన్ కి సపోర్ట్ చేస్తారని అంటున్నారు. ఐతే, ఇలా సపోర్ట్ చేయడం వెనుక పవన్ కున్న ఐడియాలజీ ఏంటనేది అందరికీ క్వశ్చన్ గా మారింది. ఏపీలో బలంగా ఉన్న పార్టీలు రెండే. ఒకటి తెలుగుదేశం, రెండు వైఎస్సార్సీపీ. ఈ రెండు పార్టీల మధ్య వచ్చి నలిగిపోయే కంటే అసలు ఈ రెండు పార్టీలని ప్రజల్లో లేకుండా చేస్తే గొడవ వదిలిపోతుంది కదా. అప్పుడు సోలోగా పోటీ చేయచ్చు కదా అని పవన్ మాస్టర్ ప్లాన్ అని వార్తలు వస్తున్నాయ్.

           2014 లో బాబుకి సపోర్ట్ చేసి, ఆయన ఏం చేయకపోతే రివర్స్ అయ్యారు. ఒక రకంగా టీడీపీ ఏపీకి ఏం చేయలేదని నిరూపించారు. ఇక మిగిలింది జగన్ ఒక్కరే. ఆయన కూడా ఏం చేయకపోతే ఏం చేయలేదు, ఇక మిగిలిన ఆప్షన్ తానే అని చెప్తారు. జనం కూడా జనసేనవైపే మొగ్గు చూపుతారని పవన్ ప్లాన్. అందుకే ఇప్పుడు జగన్ కి సపోర్ట్ చేస్తారని సమాచారం. ఐతే, పవన్ మాస్టర్ ప్లాన్ పట్ల కొందరు అసంతృప్తిగా ఉన్నారు. పవన్ కూడా అందరి లాంటి రాజకీయనాయకుడే అని అంటున్నారు. ఐతే, పవన్ గురించి తెలిసినవాళ్లు మాత్రం అందరిలాంటి వాడు కాదని అంటున్నారు. పవన్ కి కావాల్సింది అధికారం కాదని, ప్రజలకి న్యాయం జరగడమే కావాలని అంటున్నారు. తాను మద్ధతిచ్చి గెలిపించిన వాళ్ళు ప్రజలకి న్యాయం చేయకపోతే ఎదురుతిరుగుతారు, ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం కోసమే పెట్టిన పార్టీ, ఎవరూ న్యాయం చేయకపోతే ప్రశ్నిస్తారు. న్యాయం చేయడానికి ఎవరూ రాకపోతే తానే భరిలోకి దిగుతారు. ఇప్పుడు కూడా జగన్ న్యాయం చేస్తారన్న నమ్మకం ఇస్తే పవన్ సపోర్ట్ చేస్తారు. లేదంటే సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేశాక జగన్ ఏం చేయకపోతే ఎదురుతిరుగుతారు. ఆ తర్వాత తానే అధికారంలోకి వస్తారు. ఇందులో కుట్ర ఏం లేదు. ప్రజలకి న్యాయం చేయడం కోసం ఇలా ఆలోచించడంలో అస్సలు తప్పు లేదని జనసేన సైనికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

Comments