Anchor Suma Shocking Remuneration for Pelli Choopulu Show | Suma Pelli Choopulu | Anchor Pradeep

            పెళ్లి చూపుల కోసం సుమ తీసుకున్న రెమ్యున్ రేషన్ ఎంతో తెలుసా?

           సుమ.. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు బుల్లితెర పై ఈ పేరు సక్సస్ కి చిరునామా. షో ఏదైనా? కాన్సెప్ట్ ఎలాంటిదైనా? సుమ యాంకర్ అయితే చాలు ఆ పోగ్రామ్ హిట్. ఆ షో సూపర్ హిట్. అందుకే బుల్లితెర వరకు అప్పటికి ఇప్పటికి నెంబర్ 1 యాంకర్ ఎవరు అంటే ఠక్కున వినిపించే ఒకే ఒక్కమాట సుమ. అంత టాలెంటెడ్ కాబట్టే.. ఆమె బుల్లితెరకి స్టార్ మహిళ అయ్యింది. మహిళా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న స్టార్ యాంకర్ అయ్యింది. అలాంటి సుమ ఈ మధ్య కాలంలో పోగ్రామ్స్ తగ్గించేసుకొని చాలా సెలక్టివ్ గా మాత్రమే ప్రేక్షకుల ముందుకి వస్తుంది. అలా రీసెంట్ గా సుమ పెళ్లి చూపులు అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. 

          అవును ఇప్పుడు పెళ్లి చూపులు షో అందరిని కొత్తగా పలకరిస్తుంది . రోటీన్ సీరియల్స్, రోటీన్ షోలకు కాలం చెల్లింది. అందుకే తెలుగు బుల్లితెరపై కూడా విభిన్నమైన కాన్సెప్టులతో టీవీ షోలు ప్లాన్ వస్తున్నాయి. అలా ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక సరికొత్త షో 'పెళ్లి చూపులు'. తెలుగు టెలివిజన్ రంగంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా ఉన్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ 'పెళ్లి చూపులు' రియాల్టీ షోద్వారా తనకు పర్ఫెక్ట్ జోడినీ, జీవిత భాగస్వామిని ఎంచుకోబోతున్నారు. బిగ్ బాస్ 2 ముగియడంతో ఆ స్థానంలో ఈ సరికొత్త షో ప్రారంభం అయింది. దేశ విదేశాల నుండి ఎందరో తెలుగు అమ్మాయిలు రిజిస్టర్ చేసుకోగా 14 మందిని ఫైనల్ చేశారు. ఈ షోను యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్నారు.

           నిజానికి ప్రదీప్ కి పర్ఫెక్ట్ జోడీని వెతికిపెట్టే పెళ్లి పెద్దగా సుమని సెలక్ట్ చేసుకోవడం మంచి నిర్ణయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పెళ్లి చూపులు లాంటి షోలు ఇతర భాషల్లో బాగా నడిచాయి. హిందీలో రాహుల్ కీ దునియా, రాఖీ కా స్వయంవర్ రియాల్టీ షోలు విజయవంతంగా సాగాయి. తమిళంలో ఆర్యతో ఎంగే వీటు మప్పిలి పేరుతో ఇటువంటి రియాల్టీ షో ప్రసారమైంది. అక్కడ కూడా ఈ షో బాగానే ప్రజాధారణ పెరిగింది. అయితే ఇప్పుడు తెలుగులో వచ్చేసరికి దీనికి తెలుగు నేటివిటీ తీసుకొనిరావడం చాలా అవసరం . అందుకే షో నిర్వాహకులు సుమని ఈ షో కి హోస్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టే సుమ ఈ షోలో తెలుగు వారి ఎమోషన్స్ ని బాగా యాడ్ చేస్తుంది. అయితే ఇంతలా షో ని హిట్ చేయగల సామర్ధ్యం ఉన్న సుమ.. ఈ షో కోసం ఎంత రెమ్యున్ రేషన్ తీసుకుంటుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సుమారు మూడు నెలలకి పైగా జరగబోతున్న ఈ షో కోసం సుమ ఒక్కో ఎపిసోడ్ కి అక్షరాలా లక్ష యాభై వేల రూపాయలను పారితోషకంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక నిజం అయితే.. బుల్లితెర స్థాయిలో ఈ రెమ్యున్ రేషన్ చాలా ఎక్కువ. బుల్లితెర పై ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేసిన సుమ.. ఇలా రెమ్యున్ రేషన్ పరంగా కూడా ఓ సరికొత్త రికార్డ్ ని సొంతం చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు. 

Comments