Entertainment

వంద కోట్లు వ‌సూలు చేస్తున్న చిన్న హీరోలు..!

వంద కోట్లు వ‌సూలు చేస్తున్న చిన్న హీరోలు..!

అమీర్‌ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్ అంత‌లా ఆక‌ట్టుకోలేక పోయినా చోటే భ‌ళా అనిపించుకున్నాయి చిన్న సినిమాలు. కంటెంట్ ఒరియంటెడ్ సినిమాల‌తో వ‌చ్చిన లో బ‌డ్జెట్ మూవీస్ సూప‌ర్ హిట్ అయి మిలియ‌న్ క్ల‌బ్‌లో చేరాయి. కొత్త ద‌ర్శ‌కుల‌కు ధైర్యం ఇస్తున్నాయి. ప్రెండ్‌షిప్‌, ల‌వ్ మ‌ధ్య  చిన్న క‌న్ఫ్యూజ‌న్‌తో వ‌చ్చిన సినిమా సోనుకే టీటుక ఈ స్వీటీ ల‌వ్ రంజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ ఆర్య‌న్‌, నుశ్ర‌త్‌, స‌న్నీ నిజార్ లీడ్ రోల్స్‌లో రూపొందిన ఈ మూవీ  150 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు వ‌సూలు చేసి  బాలీవుడ్‌లో చిన‌న‌పాటి సంచ‌ల‌నం సృష్టించింది.

Tags

బాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌కు షాక్‌..!

బాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌కు షాక్‌..!

మీర్‌ఖాన్ సినిమా వ‌స్తుందంటే ఇప్పుడు ఇండియాతోపాటు చైనా మార్కెట్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దంగ‌ల్‌, సీక్రెట్ సూప‌ర్ స్టార్‌తో అంత‌లా మాయ చేసిన అమీర్ ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌తో ఘోరంగా బోల్తా ప‌డ్డాడు. హిస్టారిక‌ల్ డ్రామాగా వ‌చ్చిన ఈ మూవీ మొద‌టి రోజునే ప్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది.  అమీర్ దూకుడుకు అడ్డుక‌ట్ట‌లేసింది. బాలీవుడ్ మార్కెట్‌ను షాక్‌లో ప‌డేసింది. 

RRR ఓపెనింగ్ లో హైలైట్ ఇదే

RRR ఓపెనింగ్ లో హైలైట్ ఇదే

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మూవీ తెరక్కబోతున్న విషయం తెలిసింది. చెప్పినట్టుగానే చెప్పిన డేట్ కి, చెప్పిన టైమ్ కి ఈ మూవీ ఓపెనింగ్ ని నిర్వహించారు. 11 వ నెల, 11 వ తారీఖున, ఉదయం  11 గంటలకు ఈ మూవీ ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రానా, కొరటాల శివ, వి వి వినాయక్ తదితరులు హాజరయ్యారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ రావడంతో సందడి వాతావరణం నెలకొంది. 

Tags

నెం.1 స్థానంపై క‌న్నేసిన బాలీవుడ్ భామ‌లు..!

నెం.1 స్థానంపై క‌న్నేసిన బాలీవుడ్ భామ‌లు..!


బాలీవుడ్‌లో ఇప్పుడు పెళ్లి సంద‌డి మొద‌లైపోయింది. దీపికా ప‌దుకొనే - ర‌ణ్‌వీర్ సింగ్‌, ప్రియాంకా చోప్రా - నిక్ జోన‌స్ ఏడడుగులు వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆలియా భ‌ట్ కూడా అతి త్వ‌ర‌లోనే ర‌ణ్‌బీర్ క‌పూర్‌ను ప‌రిణ‌య‌మాడ‌బోతుంది. ఇక అనుష్క శ‌ర్మ ఆల్రెడీ విరాట్ కోహ్లీ బెట‌ర్ హాఫ్‌గా కుటుంబ బాధ్య‌త‌ల్లో మునిగిపోయింది. దీంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ చైర్ ఖాళీ అవుతోంది.

యాక్ష‌న్‌పై మ‌రింత ఫోక‌స్‌..!


యాక్ష‌న్‌పై మ‌రింత ఫోక‌స్‌..!

స్టార్ హీరోలు యాక్ష‌న్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. మాస్ మూవీస్‌తో ఎక్కువ‌గా హిట్స్ కొడుతున్న స్టార్‌లు ఇప్పుడు మాస్ ఇజాన్ని పీక్స్‌కు తీసుకెళుతూ బాక్సాఫీస్‌తో యుద్ధానికి దిగుతున్నారు. క‌త్తులు, గ‌న్‌ల‌తో సావాసం చేస్తున్నారు.  ప్ర‌భాస్, జూ.ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇలా వీరంతా ప్ర‌స్తుతం యాక్ష‌న్ సీన్స్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. భారీ ఫైట్ల‌తో బాక్సాఫీస్‌ను కుమ్మేయ్యాల‌ని ట్రై చేస్తున్నారు. 

దెయ్యాన్నే న‌మ్ముకున్న అంజ‌లి పాప‌


దెయ్యాన్నే న‌మ్ముకున్న అంజ‌లి పాప‌

తెలుగ‌మ్మాయి అంజ‌లి తెలుగులో ఛాన్సుల కోసం తెగ ఇబ్బందులు ప‌డుతుంది. త‌మిళంలో ఆరేడు సినిమాలు చేతిలో ఉన్నా సొంత భాష‌లో ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. క‌ష్టాలో ఉన్న స‌మ‌యంలో దెయ్యం సాయంతో హిట్ కొట్టిన అంజ‌లి మ‌రోసారి  భ‌య‌పెట్టేందుకు రెడీ అవుతోంది. లిసాగా అదృష్టం ప‌రీక్షించుకుంటోంది.

పెళ్లయ్యాక నీ భర్త తేడా అని తెలిస్తే ఏం చేస్తావ్? 

పెళ్లయ్యాక నీ భర్త తేడా అని తెలిస్తే ఏం చేస్తావ్? 

ఈ మధ్య ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలు చాలా కొత్తగా ఉంటున్నాయి. సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రశ్నలే కాకుండా, సమాజంలో జరుగుతున్న సంఘటనలని కూడా బేస్ చేసుకుని కొన్ని ప్రశ్నలను అడుగుతున్నారు. ఇలా అడగడం వల్ల ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో మెచ్యూరిటీ లెవల్స్, థింకింగ్ పవర్, పాజిటివ్ థింకింగ్ వంటివి ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలు ఉంటుందని వాళ్ళ అభిప్రాయం. ఆ క్రమంలోనే ఈ మధ్య జరిగిన సంఘటనని బేస్ చేసుకుని ఒక ప్రశ్న అడిగారు. మొన్నా మధ్య తన భర్త తేడా అని తెలిసి సోషల్ మీడియాలో అతని పరువు తీస్తూ కీర్తన అనే యువతి చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే.

Tags

మ‌హేష్‌బాబుకు బ్యాక్ ఫైర్‌..!


మ‌హేష్‌బాబుకు బ్యాక్ ఫైర్‌..!
జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు మీద మండిప‌డుతున్నారు. ఎన్టీఆర్ మూవీ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టంటే.. ఒక్క ట్వీట్ కూడా చేయ‌లేదు మ‌హేష్‌బాబు. కానీ, త‌మిళ హీరో విజయ్ మూవీపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ వేశాడు. ఇదే ఇప్పుడు ఇష్ట్యూ అయింది.

అర్జున్ లైంగిక వేధింపుల‌పై డిజిట‌ల్ ఆధారాలు..!


అర్జున్ లైంగిక వేధింపుల‌పై డిజిట‌ల్ ఆధారాలు..!

అర్జున్‌ను పీక‌ల్లోతు క‌ష్టాల్లోకి నెడుతోంది మీటూ ఉద్య‌మం. రీసెంట్‌గా అర్జున్‌ను పోలీసులు విచారించారు. ఈ సంద‌ర్భంగా మేట‌ర్ చాలా సీరియ‌స్‌గా ఉంద‌ని  అర్జున్‌కు అర్ధ‌మైంద‌ట‌. మొద‌ట అంత సీరియ‌స్‌గా ప‌ట్టించుకోని అర్జున్ ఇప్పుడు టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట‌. మీటూ ఉద్య‌మంలో భాగంగా క‌న్న‌డ హీరోయిన్ శృతి హ‌రి హ‌ర‌న్ అర్జున్‌పై ఆరోప‌ణ‌లు చేసింది. మొద‌ట ఆమె చేసిన ఆరోప‌ణ‌లు షూటింగ్‌కు సంబంధించిన‌వే.

ఆర్‌.ఆర్‌.ఆర్. అప్‌డేట్స్‌..!


ఆర్‌.ఆర్‌.ఆర్. అప్‌డేట్స్‌..!


ఇండియాలోనే నెం.1 డైరెక్ట‌ర్ అనిపించుకుంటున్న రాజ‌మౌళి త‌న కొత్త సినిమాను మొద‌లు పెడుతున్నాడు. రాజ‌మౌళి కొత్త సినిమా చాలా.. చాలా స్పెష‌ల్‌. రాజ‌మౌళి ఇప్ప‌టివ‌ర‌కు తీసిన సినిమాల సంఖ్య ప‌ది. అవ‌న్నీ ఒక ఎత్తు. కొత్త‌గా తీయ‌బోయే సినిమా మ‌రీ స్పెష‌ల్‌. రాజ‌మౌళి తొలిసారిగా మ‌ల్టీస్టార‌ర్ మూవీ తీస్తున్నాడు.  జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి ఇద్ద‌రు పెద్ద హీరోలు ఈ సినిమాలో హీరోలుగా న‌టిస్తున్నారు.