Entertainment

RRR తాజా అప్డేట్‌

RRR తాజా అప్డేట్‌

రాజ‌మౌళి సినిమాలో యాక్ష‌న్ సీన్స్ ఓ లెవ‌ల్లో ఉంటాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. న‌చ్చే వ‌ర‌కు రాజీ ప‌డ‌ని జ‌క్క‌న్న ఆర్‌.ఆర్‌.ఆర్ యాక్ష‌న్ కోసం 15 రోజుల‌పాటు కేటాయించాడు. ట్రిపుల్ ఆర్‌లో హైలెట్‌గా నిలిచే ఓ ఫైట్‌ను రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌పై చిత్రీక‌రిస్తున్నాడు. చెర్రీ మ‌రో వైపు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో విన‌య‌, విధేయ రామ చేస్తున్నాడు. 15వ తేదీ నుంచి జ‌రిగే నాన్ స్టాప్ షెడ్యూల్‌లో రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన‌నున్నాడు. అంటే ఈ లోగా ట్రిపుల్ ఆర్ మొద‌టి షెడ్యూల్ పూర్త‌వుతుంద‌న్న‌మాట‌. 

సామాజిక నేప‌థ్యంలో..


ఒకే దారిలో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌..!

2.వో సెట్స్‌పై ఉండ‌గానే క‌బాలి చేశాడు ర‌జ‌నీ. క‌బాలి పూర్తి కాగానే కాలాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి, ఆ సినిమా విడుద‌లైన రోజునే కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో పేటా మొద‌లు పెట్టాడు. 2.ఓ రీసెంట్‌గా రిలీజ్ కాగా సంక్రాంతికి పేటా రిలీజ‌వుతుంది. పేటా రిలీజ‌య్యేలోగా మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తూ యంగ్ హీరోల‌కంటే స్పీడ్‌గా దూసుకుపోతున్నాడు ర‌జ‌నీకాంత్‌. 

అంద‌ర్నీ టార్గె చేసిన బోయ‌పాటి..!

అంద‌ర్నీ టార్గె చేసిన బోయ‌పాటి..!

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూవీ విన‌య విధేయ రామ‌. రామ్ చ‌ర‌ణ్‌తో ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో ఎలాగైనా హిట్ కాంబినేష‌న్ అనిపించుకునేందుకు బోయ‌పాటి ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచిస్తున్నాడు. విన‌య విదేయ రామ అన్న టైటిల్ పెట్ట‌డంతో ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్స్ పెట్టే బోయ‌పాటి ఇంత సాఫ్ట్ టైటిల్ ఎందుకు ఎంచుకున్నాడు అన్న అనుమానం చాలా మందికి వ‌చ్చింది. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ టీజ‌ర్‌తో వీళ్ల‌కు సాధానం చెప్పాడు. 

యూత్‌ను ఆక‌ట్టుకుంటున్న క‌ల్లోలం సాంగ్‌

ఇంకో 28 రోజుల్లో 2018కి గుడ్‌బై చెప్పేస్తాం. ఇంత వ‌ర‌కు శ‌ర్వానంద్ క‌నిపించ‌లేదు. ఇయ‌ర్ ఎండింగ్‌కు ప‌ది రోజుల ముందు ఈ నెల 21న ప‌డి ప‌డి లేచే మ‌న‌సుతో వ‌స్తున్నాడు. క్రేజీ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వితో జ‌త క‌డుతూ హ‌నురాఘ‌వ‌పూడి  ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు శ‌ర్వా. 

ప‌డి.. ప‌డి.. లేచె మ‌న‌సు. టైటిల్ వింటే ల‌వ్ స్టోరీ అని ఇట్టే అర్థ‌మైపోతుంది. టీజర్ చూశాక యూత్‌ను టార్గెట్ చేసేలా సినిమా ఉంటుంద‌ని క‌న్ఫాం అయిపోయింది. రిలీజైన రెండు పాట‌ల‌ను చూస్తుంటే ఫీల్‌గుడ్ మూవీ అన్న సంకేతం ఇచ్చాడు హ‌ను రాఘ‌వ‌పూడి.

అమ్మాయిలూ.. మీపై కేసులు పెట్టిస్తాం : ప‌వ‌న్‌

అమ్మాయిలూ.. మీపై కేసులు పెట్టిస్తాం : ప‌వ‌న్‌

అమ్మాయిలూ... మీపై కేసులు పెట్టిస్తానంటూ జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కాగా, ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా ముమ్మ‌ర ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాధార‌ణ ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న త‌రుణంలో గెలుపే ల‌క్ష్యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. 

బాహుబ‌లి -2లో స‌గం కూడా క‌లెక్ట్ చేయ‌ని 2.ఓ..!

బాహుబ‌లి -2లో స‌గం కూడా క‌లెక్ట్ చేయ‌ని 2.ఓ..!

ర‌జ‌నీకాంత్‌కు ఉన్న ఇమేజ్‌తో పోల్చుకుంటే ప్ర‌భాస్ కు ఉన్న క్రేజ్ చాలా త‌క్కువ‌. ర‌జ‌నీకాంత్ ఆలిండియా సూప‌ర్ స్టార్ కావ‌డంతో 2.ఓ సౌత్‌తో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించ‌డంతో హిందీలోనూ  భారీ ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని అంచ‌నా వేశారు.  అందుకు త‌గ్గ‌ట్టే హిందీలో మొద‌టి రోజు రూ.20 కోట్లు రాబ‌ట్టినా బాహులితో పోల్చుకుంటే స‌గం కూడా రాలేదు. 

స‌మంత తాజా ట్వీట్ వైర‌ల్‌..!

టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ బ్యూటీ స‌మంత త్వ‌ర‌లో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నుంది. స‌మంత త‌న కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ద్విపాత్రాభిన‌యం పోషిస్తోంది. అయితే, ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య వ‌య‌సులో 50 ఏళ్ల తేడా ఉంది. అమ్మమ్మ‌, మ‌న‌వ‌రాలిగా న‌టించాల్సి రావ‌డంతో టెన్ష‌న్ ప‌డుతోంది స‌మంత‌. 

స‌మంత త్వ‌ర‌లో నందినిరెడ్డి డైరెక్ట్ చేసే మూవీలో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నుంది. అమ్మ‌మ్మ మ‌న‌వ‌రాలిగా ఎలా మారుతుంద‌న్న కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన కొరియ‌న్ మూవీ ఆధారంగా మిస్‌క్రాని ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. ఈ పాత్ర త‌న కెరీర్‌లో అత్యంత స‌వాల్‌తో కూడుకున్న‌దంటు అంటోంది సామ్స్‌. 

తొలి అడుగులోనే ఇంప్రెస్ చేస్తున్న ముద్దు గుమ్మ‌లు


తొలి అడుగులోనే ఇంప్రెస్ చేస్తున్న ముద్దు గుమ్మ‌లు

వెండి తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న హీరోయిన్స్ సంఖ్య పెరుగుతున్నా.. కొంద‌రు మాత్ర‌మే అభిన‌యంతో ఫ్లాట్స్ చేస్తున్నారు. వీరి ఫ‌స్ట్ మూవీ ఇదే అంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే అన్నంత‌గా మెప్పించేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ ముద్దు ల కూతురు సారా అలీఖాన్ కేదార్‌నాథ్ అనే హిందీ సినిమాతో వ‌స్తుంది. చార్‌దామ్ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ప్రేమ క‌థ‌గా తెర‌కెక్కిన ఈ మూవీ డిసెంబ‌ర్ 7న రిలీజ‌వుతుంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ సాంగ్స్‌లో ఈ డెబ్యూ హీరోయిన్ సీనియ‌ర్ ఆర్టిస్టుల‌తో పోటీ ప‌డి మ‌రీ న‌టించింది.